పుట:Jyothishya shastramu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పుడు వృశ్చికలగ్న జాతకునకు శాశ్వతముగా భూమి, కేతు, గురు, కుజ, చంద్ర, సూర్యగ్రహములు మిత్రులుగా ఉన్నారనీ, అలాగే రాహు, శని, మిత్ర, చిత్ర, బుధ, శుక్ర గ్రహములు శాశ్వతముగా శత్రువులై ఉన్నారనీ తెలిసిపోయినది. ఇప్పుడు అడిగిన ప్రశ్న వ్యాపారమును గురించినది. అందువలన వ్యాపారము ఎవరి (ఏ గ్రహము) ఆధీనములో ఉన్నదని చూచిన వ్యాపారము బుధగ్రహము యొక్క ఆధీనములోనిదని తెలిసిపోయినది. వ్యాపారమునకు అధిపతియైన బుధుడు శత్రువర్గములో నున్న గ్రహమైనందువలనా మరియు బుధగ్రహము పాప స్థానమున ఉండుట వలనా, ఆ జాతకునికి వ్యాపారము సరిపోదనీ, ఒకవేళ వ్యాపారము చేసినా అందులో అతనికి నష్టమేవచ్చునని తెలియుచున్నది. అందువలన అతనికి ఏ వ్యాపారమూ సరిపోదని చెప్పవచ్చును. అయితే అతని జీవితము సాగుటకు ఏ జీవనము, (ఏ పనిని) చేయునని అడిగితే దానికి సమాధానము గా ఇట్లు చెప్పవచ్చును. ముఖ్యముగా నాల్గవ స్థానమున చంద్రుడుండుట వలన, చంద్రుడు తొమ్మిదవ స్థానాధిపతి అయినందున, చంద్రుడు పదవ స్థానమైన సింహలగ్నమును తాకుట వలన అతను తన తెలివితో జీవించు ననియూ, చంద్రుని కారణముగా తెలివిగా వాదించు లాయర్‌ పనిని చేయు ననియూ, చంద్రుడు రాజయిన సూర్యుని స్థానమును తాకుచుండుట వలన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా (ప్రభుత్వ లాయర్‌గా) పని చేయుననియూ, అలా కొంతకాలము దాదాపు 12 సంవత్సరములు పని చేసిన తర్వాత న్యాయవాది నుండి న్యాయాధిపతిగా (జడ్జిగా) పని చేయునని చెప్పవచ్చును. పదవ స్థానమును చంద్రుడు చూచుట వలన ప్రభుత్వము తరపున ముద్రణ అధికారముగల వ్యక్తిగా పని చేయునని చెప్పవచ్చును. ఈ విధముగా స్థానమునుబట్టియు, గ్రహమునుబట్టియు చెప్పవచ్చును. కర్కాటకము, సింహము రెండు రాజు మంత్రికి సంబంధించినవి కావున వాటితో