పుట:Jyothishya shastramu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శత్రువర్గములైన ఆరు గ్రహముల రాళ్ళు ఆ గ్రహముల కిరణములను ఎక్కువ ఆకర్షించుట వలన రాళ్ళు ధరించిన వ్యక్తికి ఇబ్బందులు కలుగును. అందువలన ఏ మనిషి అయినా తనకు మిత్రులుగాయున్న గ్రహములేవో తెలిసి, ఆ గ్రహములకు సంబంధించిన రాళ్ళనే ధరించడము మంచిది. శత్రువర్గ గ్రహముల రాళ్ళు ధరించకూడదు. ఇప్పుడు గ్రహముల ఆధీనములోని దిశలను తెలుసుకొందాము.

ఈ విధముగా పన్నెండు గ్రహములకు పది దిశలు ఆధీనములో గలవు. పై దిశకు కేతువు, మిత్ర రెండు గ్రహములు అధిపతులుగాయున్నవి. అట్లే క్రింది దిశకు భూమి, చిత్ర రెండు గ్రహములు అధిపతులుగాయుండుట వలన పన్నెండు గ్రహములకు పది గ్రహములు వచ్చినవి. ఇప్పుడు ద్వాదశ గ్రహముల ఆధీనములో ఏయే ధాన్యములున్నవో తెలుసుకొందాము.