పుట:Jyothishya shastramu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10) భూమి - అరికాళ్ళ, అరచేతుల మంటలు, కాళ్ళు చేతులు చీలుట.

11) మిత్ర- తలనొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మనోరోగములు.

12) చిత్ర - మోకాళ్ళ నొప్పులు, గుండెనొప్పి.

ఈ విధముగా ఎన్నో రోగములు పన్నెండు గ్రహముల ఆధీనములో ఉన్నవి. మనిషి చేసుకొన్న కర్మనుబట్టి కర్మప్రకారము ఆయా గ్రహముల నుండి ఆయా రోగములు వచ్చును. ఇక్కడ చెప్పిన రోగములే కాకుండ వాటికి అనుబంధమైన రోగములు ఏవైనా రావచ్చును. ఇప్పుడు గ్రహముల ఆధీనములోని రాళ్ళ విషయము తెలుసుకొందాము.

పన్నెండు గ్రహముల ఆధీనములో పైన కనపరచిన రాళ్ళు ఉన్నవి. అయితే కొందరు ఈ రాళ్ళను తమ ఉంగరములో ధరించు చుందురు. అలా ధరించుట వలన పన్నెండు రాళ్ళకు అధిపతులైన పన్నెండు గ్రహములు తమకు అనుకూలముగా ఉందురనీ, వారివలన ఏ ఇబ్బందులు కలుగవని కొందరు జ్యోతిష్యులు చెప్పడము వలన వాళ్ళు రత్నముల ఉంగరములు ధరించుచుందురు. అలా ధరించుట వలన ధరించిన మనిషికి అనుకూలమైన గ్రహముల వలన ఏ ఇబ్బందీ ఉండదు. అయితే ఆ మనిషికి