పుట:Jyothishya shastramu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుక్రగ్రహము మిత్రుడై కాలచక్రములో తిరుగుతూ, కళత్ర స్థానమైన ఏడవ స్థానమును తన కిరణముల చేత తాకితే యుక్తవయస్సులో అందమైన భార్యను ఇచ్చును. అందమైన భార్యయేకాక అమె అనుకూలమైన భార్యjైు ఉండును. భార్య వలన మంచి పేరు వచ్చుటయేగాక ఆమెవలన మంచి సుఖము లభించును. ఒకవేళ శుక్రుడు వ్యతిరేఖి అయితే భార్య విషయములో ముందు చెప్పిన దానికి భిన్నముగా ఉండును. భార్యవలన మనిషికి కష్టమే ఉండును. ఇట్లు ఆయా స్థానములనుబట్టి గ్రహముల మిత్ర శత్రుత్వములనుబట్టి గ్రహముల ఆధీనములోని విషయములు మంచిగానో, చెడుగానో లభ్యమగుచుండును. గ్రహము జాతకరీత్యా అనుకూలమైతే దాని ఆధీనములోని విషయములన్నీ మంచిగానే లభించును. గ్రహము మంచిది కాకపోతే ఆ గ్రహమునుండి దాని ఆధీనములోనివి ఏమీ లభించవు. అంతేకాక ఉన్నవి కూడా పోవును. జాతక కుండలిలోని అన్ని గ్రహముల విషయములు అట్లే ఉండునని తెలియవలెను.

శని గ్రహము

శని గ్రహము ఆధీనములోని విషయములను ఇక్కడ చెప్పు కొందాము. ఆయుష్షు, నీచవిద్య, నీచ దేవతోపాసన, మరణము, దుఃఖము, అసత్యము, అధర్మము, బంధనము, కురూపము, శాంతము, దుష్ప్రవర్తన, పాపము, నరకము, నీచ జీవనము, రోగములు, దాసీజన సౌఖ్యము, విధవ సౌఖ్యము, నపుంసకత్వము, పౌరుషహీనము, పాపార్జన, అనాచారము, జీవహింస, మాలిన్యవస్త్రం, శిధిల వస్తువులు, పాపుడు, కూృారత్వము, బూడిద పూసుకొన్నవాడు, సన్య్నాసి లేక సన్న్యాసిని, నల్లటి వస్త్రములు పాపులతో స్నేహము, శూద్రుడు, వ్యవసాయదారుడు, జైలు, కృశించిన శరీరము గలవాడు, చినిగిన వస్త్రములుకలవాడు, బ్రాహ్మణద్వేషి, దున్నలకు అధిపతి,