పుట:Jyothishya shastramu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుక్ర గ్రహము

ద్వాదశ గ్రహములలో మానవునికి సుఖములను అందివ్వడములో దీనిని మించిన గ్రహములేదు. శుక్రుడు శని వర్గములోనివాడు. శనివర్గము లోని వారికి ఎంతో విలువైన సుఖములను అందించును. అటువంటి శుక్రగ్రహము ఆధీనములోనున్న విషయములను ఇప్పుడు చూద్దాము. శుక్రుడు కళత్రకారకుడు అందువలన భూమిమీద ఏ మనిషికైనా భార్య లభించాలంటే శుక్రుని కిరణములమీదే ఆధారపడియుండును. అంతేకాక ఆయన ఆధీనములోని విషయములు ఇలా కలవు. వివాహము, నాటక సాహిత్యము స్త్రీసౌఖ్యము, కామము, భోగము, వ్యభిచారము, వాహన సుఖము. ఆభరణములు, ఐశ్వర్యము, ముద్రణాధికారము, హాస్యము, మేహము, వేశ్యాసంభోగము, కన్యత్వలభ్యము. తెల్లని వస్త్రము, సుగంధములు, సౌందర్యము, జలక్రీడ, చిత్రలేఖనము, కవిత్వము, గ్రంథరచన, సంగీతము, సామవేదము, మద్యపానము, నృత్యము, యువతి, మనోభావములు, అష్ట భోగములు, అష్ట ఐశ్వర్యములు, శృంగార కావ్య రచనలు, దేహసుఖము, సౌందర్యము, సుకుమారము, వీణ లేక వేణు గానము, వాహన సౌఖ్యము, అన్యస్త్రీల ఆలింగనము, బహుస్త్రీ సంగమము, కళానైపుణ్యము, వీర్యబలము, శివభక్తి, శాంభవీవిద్య, మృధురతి, స్త్రీలకు మిక్కిలి ప్రియముగా ఉండుట, వివాహములలో విందులలో పాల్గొనుట. సభా సన్మానములు, వేశ్యలు సన్నిహితముగా ఉండుట. వ్యసనాలలో స్త్రీకి లొంగిపోవడము, తాంబూలము, మాంసభక్షణ, శక్తిపూజలు, పశువుల ఇండ్లు, బండ్లు విడుచు స్థలము, వ్యభిచార గృహములు, పశువుల ఇళ్ళు, వంట కట్టెలు పెట్టుచోటు, శయన గృహములు నవ యవ్వనుల మిత్రత్వము. కామకేళీ విలాసము. ఈ విధముగా శుక్ర గ్రహము యొక్క ఆధీనములోని విషయములు గలవు.