పుట:Jyothishya shastramu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భయంకరుడు, జంతువులతో రమించువాడు, నీచదేవతోపాసన, పాతాళ గృహము, కంచర గాడిదలు, చెడు ప్రవర్తన, దారిద్య్రము, వంటలవాడు, మద్యపానము విక్రయించువాడు, మాంసవిక్రయుడు, మాంసవిక్రయశాల, భోజనవిక్రయము, ఇనుము అంగడి, శిథిల గృహము దాని నివాసము, కాఫీ హోటళ్ళు, దిబ్బలు, మల విసర్జన స్థలములు, స్మశానము, చీకటిల్లు, ఈశ్వరి మాన్యములు, సమాధులు, జమ్మిచెట్టు, నూగులు, వృద్ధత్వము, మారణాస్త్రములు, శక్తి ఆలయములు, నలుపురంగు, కామదహన స్థలము, పీర్ల గుండము, సారాయి, కల్లు, అంగళ్ళు, ఇనుము, ఇనుప వ్యాపారము.

ఇవన్నియు శని ఆధీనములో ఉన్న వస్తువుల విషయములు. ఉదాహరణకు ఇనుము శని ఆధీనములోని లోహము కదా! అందువలన శని గ్రహము అనుకూలమైన జాతకులు కొందరు ఇనుము వ్యాపారము చేయుచూ, శనిగ్రహము వలన మంచి లాభములనుపొంది పెద్ద ధనికులుగా మారినవారు కలరు. శనిగ్రహము వ్యతిరేఖముగా ఉంటే నష్టాలలో ముంచి నీచ వృత్తిని చేయించిన విధానము కూడా కలదు. శని అంటే అన్నీ చెడు చేయువాడనీ, కష్టపెట్టువాడనీ అందరూ అనుకోవడము జరుగుచున్నది. అందరూ అనుకొన్నట్లు శని కష్టపెట్టుటకు మాత్రమే ఉన్నాడని అనుకోవడము పొరపాటు. శని కాలచక్రములో తిరుగునప్పుడు ఆయన కిరణములు కర్మచక్రము మీద పడుచూ పోవుచుండును కదా! అప్పుడు ఆ స్థానములలో ఉండు పాపపుణ్యములనుబట్టి మనిషికి కష్టసుఖములు కల్గుచుండును. శని గ్రహము మిత్రుడైతే అన్నీ మంచే జరుగును. శత్రువైతే అన్నీ చెడే జరుగునని తెలియవలెను. అందువలన ఏ గ్రహముగానీ తాను స్వయముగా చెడును కలుగజేయుటకే ఉండుననుకోవడము పొరపాటు. ఇప్పుడు రాహు గ్రహమును గురించి తెలుసుకొందాము.