పుట:Jyothishya shastramu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనుటకు వీలులేదు అన్నాడు. అయితే తన గీతయందు బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము జ్ఞానమును తెలియగలిగితే, అటువంటివాని కర్మ యంతయు జ్ఞానాగ్నిలో కాలిపోవును అన్నాడు. ఇంతవరకు మనము తెలుసుకొన్న జ్యోతిష్యము ప్రకారము కాలచక్రములో గ్రహములు తిరుగు చున్నంతకాలమూ, కర్మచక్రములో కర్మయున్నంతకాలమూ, జీవుడు గుణ చక్రమును వదలి బయటపడడు అని తెలియుచున్నది. అంతేగానీ జ్ఞానము కల్గిన వానికర్మ ఈ విధముగా తొలగిపోతున్నదని ఎక్కడా చెప్పుకోలేదు. కర్మచక్రములోని కర్మను జ్ఞాని అయినవాడు అనుభవించకుండా ఎలా తప్పించుకొనును? అను ప్రశ్న ఇక్కడ మొదలగుచున్నది. ఈ ప్రశ్నకు జవాబుగా మేము (నేను+నాఆత్మ) చెప్పునదేమనగా!

గ్రహచార విధానమైన ద్వాదశ లగ్నములు, ద్వాదశ గ్రహములు, ప్రారబ్ధకర్మయున్న విధానములో కర్మను తీసివేయుటకు ఎటువంటి వీలులేదు. అందువలన ఒక మనిషి జీవితములోని కర్మను అవసరమునుబట్టి జ్ఞానము ప్రకారము తీసివేయుటగానీ, తగిలించుటకుగానీ ఒక విధానమును దేవుడు ప్రత్యేకముగా అమర్చిపెట్టాడు. దానినే దశాచారము అంటున్నాము. దశాచారము అని పేరు పెట్టబడిన విధానములో జ్ఞానము వలన ప్రారబ్ధమును కొంత లేకుండ చేసుకోవచ్చును. అలాగే క్రొత్తగా ప్రారబ్ధమును తగిలించనూవచ్చును. అయితే కర్మను తగిలించు విధానమును దేవుడు ఎక్కువగా చెప్పకుండా, కర్మను తీసివేయు విధానమునే ఎక్కువగా చెప్పాడు. దేవుడు చెప్పిన బ్రహ్మవిద్యాశాస్త్రమునుబట్టి ఒక మనిషి కర్మను తీసివేయుటకు గానీ, అలాగే తగిలించుటకుగానీ చేయగలడు. గ్రహచార విధానములో ఎక్కడా కర్మను తగ్గించుటగానీ, తప్పించుటగానీ చెప్పలేదు. అయితే ఆ కర్మపోవు ప్రక్రియ దశాచారము అను విధానమునందు కలదని తెలియ