పుట:Jyothishya shastramu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలెను. ముఖ్యముగా చెప్పునదేమంటే! ఇంతవరకు ఏ జ్యోతిష్య శాస్త్రవేత్తకు ఈ విషయము తెలియదు. జ్యోతిష్యులందరికీ గ్రహచారము తెలుసు. అలాగే దశాచారము తెలుసు. అయితే ప్రారబ్ధకర్మను రద్దుచేయు విధానముగానీ, తగిలించు విధానముగానీ దశాచారములో ఉన్నదని తెలియదు. జ్యోతిష్యము లో గ్రహచారము, దశాచారము ఉన్నట్లు జ్యోతిష్యులందరికీ తెలుసు. ఎవరి జాతకమును వ్రాసినా గ్రహచార, దశాచారమను రెండు విధానములను వ్రాసియుందురు. అయితే భగవద్గీతలో దేవుడు చెప్పిన కర్మను కాల్చు విధానము దశాచారములో ఉన్నట్లు బహుశా ఎవరికీ తెలియదు.

ప్రతి మానవునికియున్న గ్రహచార, దశాచారములలో అజ్ఞానికి గ్రహచారము ముఖ్యము. జ్ఞానికి దశాచారము ముఖ్యము. జ్ఞానులకు ముఖ్యమైనది దశాచారమని జ్ఞానులందరికీ తెలియదు. అందువలన ఇప్పుడు ఈ గ్రంథము ద్వారా జ్ఞానులైన వారందరూ తమ కర్మను దశాచారములో రద్దు చేసుకోవచ్చునని తెలియవచ్చును. జ్ఞానులకు ఎంతో ముఖ్యమైన దశాచారమును గురించి అంతాకాకున్నా, కొంతవరకైనా తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము. ఒక మనిషికి గ్రహచారము అతని తలలోని కర్మ, కాల, గుణచక్రములనుబట్టి తెలియవచ్చును. గ్రహచారమును తెలియుటకు పంచాంగములోని ఐదు అంగములైన (భాగములైన) తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములలో ముఖ్యముగా ఉపయోగపడునది ఒకటి కలదు. అదియే నక్షత్రము. నక్షత్రమనబడునది ఐదు అంగములలో మధ్యనగలదు. పంచాంగములకు మధ్యన ఉండుట వలన నక్షత్రము పంచాంగమునకు కేంద్రములాంటిది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణమను ఐదు పేర్లలో నక్షత్రమను పేరు ప్రత్యేకత కలదిగా తెలియుచున్నది. క్షత్రము అనగా