పుట:Jyothishya shastramu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడు (నియరెస్ట్‌ నైబర్‌) అయిన వానిని అడిగి దీనికి జవాబును చెప్పుతాను. అందువలన నేను, నా వాడు కలిసి మేము చెప్పునదేమనగా!

చాలామంది పెద్దలు ఎవడు చేసిన కర్మను వాడు అనుభవించక తప్పదు అన్నారు. కొందరు ఆత్మజ్ఞానులు ‘‘విష్ణు, ఈశ్వర, బ్రహ్మదేవుళ్ళు కూడా కర్మకు అతీతులు కారు. ప్రారబ్ధమును వారు కూడా అనుభవించక తప్పించుకొనుటకు వీలుకాదు’’ అన్నారు. అంతేకాక ఒకమారు సంచితకర్మగా మారిపోయి తిరిగి ప్రారబ్ధమైన తర్వాత దానినుండి ఎవరూ తప్పించు కొనుటకు ఏమాత్రము వీలులేదు. గ్రహముల ఆధీనములోనున్న కర్మను ఏ మనిషిగానీ, ఎటువంటి క్రియవలనగానీ, కొద్దిపాటిగా తీసివేయనూ లేడు, కొద్దిపాటి కర్మను కలపనూ లేడు. ప్రతి మనిషీ నిత్యమూ, ఒక్క క్షణము కూడా ఊరకయుండక కర్మను అనుభవించు విధానమును దేవుడు నిర్మించాడు. అటువంటి విధానమును ఎవరూ అతిక్రమించలేరు. అయితే ఎంతో గట్టిగా ఏర్పరచిన కర్మ విధానమునుండి ఒక్క క్షణము కూడా ఎవడూ తప్పించుకో లేడని చెప్పిన దేవుడు భగవద్గీతలో జ్ఞానయోగమున 37 శ్లోకమందు ఇలా చెప్పాడు.

శ్లో॥ 37. యథైధాంసి సమిద్దోగ్ని ర్భస్మసాత్కురుతేర్జున ।
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ॥

భావము :- ‘‘ఏ విధముగా అగ్నియందు కట్టెలు కాలి భస్మమై పోతున్నాయో, అదే విధముగా జ్ఞానమను అగ్నియందు సర్వకర్మలు కాలిపోవుచున్నవి.’’ అని స్వయముగా భగవంతుని రూపమునవున్న దేవుడే చెప్పాడు. దేవుడే కర్మను పాలించుటకు ఖగోళములో ద్వాదశగ్రహములను ఏర్పరచి, వారిని విధి విధానమును తప్పక నడుపునట్లు చేశాడు. ఎవడూ కర్మనుండి తప్పించు