పుట:Jyothishya shastramu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని అంటాము. మనిషి జీవితములో అతను జీవించు వరకు కొన్ని పదుల సంవత్సరములుండును. ఆ పదుల సంవత్సరములలో ప్రత్యేకించి కొన్ని సంవత్సరములు మాత్రము ఒక గ్రహము ఆధీనములో ఉండునని, దాని తర్వాత కొన్ని సంవత్సరములు మరియొక గ్రహము యొక్క ఆధీనములో ఉండునని తెలుపు విధానమును దశాచారము అంటున్నాము. ఇంతకుముందు మనము తెలుసుకొన్న జ్ఞానములో ఆగామి, సంచిత, ప్రారబ్ధ అను మూడు కర్మలు కలవని తెలుసుకొన్నాము. ప్రారబ్ధకర్మ ప్రకారము మనిషి జీవితము జరుగుననీ, ప్రారబ్ధకర్మ ప్రకారము కాలచక్రములోని పన్నెండు గ్రహములు కర్మను ఆచరింపజేయుచూ, అనుభవింపజేయుచున్నవనీ తెలుసుకొన్నాము. ప్రారబ్ధ కర్మప్రకారము గ్రహములు మనిషిచేత ఆచరింపజేయు కార్యములను గ్రహచారము అంటున్నాము. కర్మ గ్రహముల చేతిలో ఒక పద్ధతిగా అయిపోవుచున్నది కదా! దానినే గ్రహచారము అంటున్నాము కదా! అలాంటప్పుడు దశలు దశాచారములు అని చెప్పడమేమిటనీ, దశాచారములో ఏ కర్మ అమలు జరుపబడుననీ, దశాచారములు ఉండవలసిన అవసరమేమిటనీ ఎవరైనా అడుగవచ్చును. ఈ ప్రశ్న పద్ధతి ప్రకారము ఎవరైనా అడుగవచ్చును. ఇది హేతుబద్ధమైన ప్రశ్నయే అయినందున దీనికి జ్యోతిష్య పండితులే సమాధానము చెప్పాలి. నేను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడను. కావున ఈ ప్రశ్నకు నేను సమాధానము ఇవ్వలేను. నాది ఆధ్యాత్మికము కావున ఆ విషయములో సమాధానమును చెప్పగలనుగానీ, జ్యోతిష్యశాస్త్రములోని ప్రశ్నలకు సమాధానము చెప్పు స్థోమత నాకు లేదు. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు కావాలి. అందువలన అన్ని శాస్త్రములను తెలిసినవాడైన నాహితుడు, నన్ను నడుపువాడు, నా ప్రక్కనేయున్న నా పొరుగువాడు, అత్యంత దగ్గరున్న