పుట:Jyothishya shastramu.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కొనెడివారు. నేడు అటువంటి అవసరము లేకుండా వందసంవత్సరముల పంచాంగములను కంప్యూటర్‌లో ఎక్కించియుండడము వలన, వంద సంవత్సర పంచాంగమునుగానీ లేక యాభై అరవై సంవత్సర పంచాంగ విషయములను గానీ సులభముగా తెలియవచ్చును. అంతేకాక ఏ గణితము వేయకుండా లగ్నమునూ, నక్షత్రమునూ, దశలనూ నిమిషముల వ్యవధిలో తెలియవచ్చును. ఇప్పుడు అన్ని సౌకర్యములు ఉండినా, ఈ శాస్త్రము ఇలా ఉంది అని తెలియుటకు వరుసగా అన్ని విషయములను మేము వ్రాసి చూపించడము జరిగినది. ఇంతవరకు గ్రహచారమును తెలియుటకు కావలసిన వివరమును అందించాము. ఇప్పుడు దశలు అంటే ఏమిటి? దశాచారము అంటే ఏమిటి? అను విషయమును వివరించుకొందాము.

37. దశలు అంటే ఏమిటి?

కొద్దిపాటి చదువును కల్గినవారికీ, కనీసము ఐదవతరగతి చదివిన వారికైనా దశ అంటే గణితము ప్రకారము పదియని తెలియగలదు. పది అను సంఖ్య మన జీవితములో అనేక విషయములయందు ఉపయోగించు కొని మాట్లాడుచుందుము. ఇప్పుడు ఇక్కడ మనము చెప్పుకొనునది స్వయముగా మనిషి జీవితములోని కర్మకు సంబంధించినది. అందువలన ఈ దశలను జాగ్రత్తగా తెలుసుకొందాము. దశ అనగా పదియనీ, దశలు అనగా కొన్ని పదులని తెలియుచున్నది. ఆచరణ అనగా చేయబడు కార్యమనీ, ఆచారము అనగా చేయబడు విధానము అనీ అర్థము. ఆచారి అనగా ఏ కార్యమును ఎలా చేయాలో తెలిసినటువంటివాడని అర్థము. కొన్ని పదుల సంవత్సరములు జరుగు ఆచరణలను తెలుపునది దశాచారము