పుట:Jyothishya shastramu.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కర్మ 69 సం॥, 5 నెలల, 10 రోజులకొకమారు సంచితముగా మారుచున్నది. వచ్చిన ఆగామికర్మ, మారిన సంచితకర్మ కర్మచక్రములో క్రింది భాగమున అణిగియుండగా, ఒక జన్మకు మాత్రము నిర్ణయించబడిన ప్రారబ్ధకర్మ కర్మచక్రములోని పన్నెండు రాశులందు తేలుతూయుండును. పైకి తేలుచున్న ప్రారబ్ధకర్మ మీదనే కాలచక్రములోని గ్రహముల కిరణముల వెలుగు పడుచుండును. అలా పడిన కిరణములు తమతోపాటు కర్మచక్రములోని ప్రారబ్ధకర్మ యొక్క రంగును (పాపపుణ్యములను) తీసుకొని క్రిందగల గుణ చక్రములోని జీవునిమీద ప్రసరింపజేసి, ఆ కర్మను జీవుడు అనుభవించునట్లు చేయుచున్నవి. అలా ప్రారబ్ధకర్మను అనుభవించడమును జీవితము అంటాము.

జీవితము జననముతో ప్రారంభమై మరణముతో ముగియుచున్నది. జీవితము ప్రారంభమయ్యేది గుణచక్రములోనున్న జీవునికే అయినా అది ఏ కర్మనుండి ప్రారంభమగుచున్నదో, ఏ కర్మతో అంత్యమగుచున్నదో తెలియుటకు కర్మచక్రము మీద ఆధారపడవలసిందే. కర్మచక్రములో ఏ కర్మను ఏ గ్రహము ప్రారంభించునో తెలియుటకు కాలచక్రము మీద ఆధారపడవలసిందే. కర్మచక్రములోని సంచితకర్మ మనిషి మరణములో ప్రారబ్ధకర్మగా కొంత ఏర్పడి, రెండవ జీవితమునకు కారణమగు చున్నది. ఇదంతయు కొంతవరకు తెలియాలంటే కాలచక్రమునుండియే ప్రారంభించాలి. కాలచక్రమునుబట్టి ఏ కాలములో మనిషి జన్మ జరుగు చున్నదో, ఆ కాలమునుండి జీవిత పథకము నిర్ణయించబడుచున్నది. కావున ఆ కాలమును జాపథకము అంటారు. ‘జ’ అనగా పుట్టుట అని అర్థము. పుట్టుక సమయములో లేక పుట్టిన కాలములో నిర్ణయించబడిన జీవిత ప్రారబ్ధమును జీవిత ఫతకముగా నిర్ణయించారు. ఫతకము అనగా ముందే