పుట:Jyothishya shastramu.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లగ్నములనాలో తెలియదు. దేవునికీ భగవంతునికీ తేడా తెలియక ఇద్దరూ ఒకటే కదా! అన్నట్లు, లగ్నమూ, రాశీ రెండూ ఒకటే కదా! అంటున్నారు. దేవుడు వేరు, భగవంతుడు వేరని మేము వ్రాసిన ఆధ్యాత్మిక గ్రంథములలో మాత్రమే తెలిసినట్లు, ఇప్పుడు ఈ గ్రంథములో మాత్రమే లగ్నము వేరు, రాశివేరని తెలియుచున్నది. ముందు ఇతరుల చేత వ్రాయబడిన విషయములకు, ఇప్పుడు మాచేత వ్రాయబడిన విషయములకు ఎంతో తేడాయుండుట వలన విచక్షణతో జాగ్రత్తగా చదువవలెనని తెలుపుచున్నాము.

33. కాలచక్రమునకు జీవునికి సంబంధమేమి?

మనిషి తలలో ఎవరికీ కనిపించకుండ సూక్ష్మముగా నాలుగు చక్రముల నిర్మాణముందని తెలుసుకొన్నాము కదా! వాటిలో అన్నిటికంటే పైనగల బ్రహ్మచక్రముతో మనకు సంబంధములేదు. మనకున్న సంబంధ మంతా కాల, కర్మ, గుణచక్రములతోనే కలదు. జీవుడు గుణచక్రములో గుణముల మధ్య ఉండగా, కర్మచక్రములోని కర్మను ఆధారము చేసుకొని, కాలచక్రములోని గ్రహములు జీవునిమీద తమ ప్రభావమును చూపుచున్నవి. కాలచక్రములోని ద్వాదశ గ్రహములు క్రిందగల కర్మచక్రము మీదనుండి కర్మను గుణచక్రములోని జీవునిమీద ప్రసరింపజేయుచున్నవి. మనిషికి ముఖ్యముగానున్న మూడు కాల, కర్మ, గుణచక్రములలో పైనగల కాలచక్రము నకు క్రిందగల గుణచక్రమునకు అనుసంధానముగా కర్మచక్రమున్నది. క్రిందగల గుణచక్రములోని జీవుడు కర్మచక్రములోని కర్మతో సంబంధపడి యుండగా, కర్మచక్రములోని కర్మ పైనగల కాలచక్రములోని గ్రహములతో సంబంధపడియున్నది. జీవుడు (మనిషి) జన్మలోగానీ, మరణములోగానీ గుణచక్రమును వదలి బయటికి పోలేదు. మనిషి సంపాదించుకొన్న ఆగామి