పుట:Jyothishya shastramu.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1½ సం॥ము పట్టుచున్నది. గురువు కాలచక్రములోనున్న పన్నెండు లగ్నములను దాటుటకు 12 సం॥ముల కాలము పట్టుచున్నది. నాలుగు గ్రహములు 18 సం॥ గమనమునూ, మరియొక నాలుగు గ్రహములు 1 సంవత్సర గమనమునూ, మిగత నాలుగు గ్రహములు వేరువేరు గమనమునూ కల్గియున్నా, పన్నెండు గ్రహములు పన్నెండు విధముల వేగము కల్గియున్నారని చెప్పవచ్చును. ఎందుకనగా! ఒక సంవత్సర గమనమును కల్గియున్న నాలుగు గ్రహములు ఖచ్చితముగా సం॥ములోనే కాలచక్రమును ఒకమారు దాటునని చెప్పలేము. నాలుగు గ్రహములు ఒకే వేగమును కల్గియున్నా చివరికవి ఒకటి లేక రెండు నిమిషములు మొదలుకొని ఐదు లేక ఆరు నిమిషముల తేడాతో పయనించుచున్నవి. ఒకప్పుడు ఆరు నిమిషములు ముందున్న గ్రహము మరియొకప్పుడు ఐదు లేక ఆరు నిమిషముల ఆలస్యము కూడా కావచ్చును. పన్నెండు గ్రహములు వాటికున్న వేగములో ఒకటినుండి ఆరు నిమిషములవరకు ముందు వెనుక ప్రయాణించుచున్నవి. ఒక్కొక్కప్పుడు అన్ని గ్రహములు ఎటువంటి ముందు వెనుక లేకుండా, తమకున్న వేగముతో ఖచ్చితముగా ప్రయాణము చేయగల్గు చున్నవి. అనేక (అన్ని) గ్రంథములలో కేవలము తొమ్మిది గ్రహములను గురించే వ్రాయడము జరిగినది. ఈ గ్రంథములో మాత్రము ప్రత్యేకించి పన్నెండు గ్రహములను గురించి వ్రాయడము జరిగినది. అట్లే వేగములో కూడా మూడు విధముల వేగమును చూపడము జరిగినది. ఈ గ్రంథములో కొన్ని విషయములను క్రొత్తగా ఇక్కడినుండే చెప్పడము వలన జాగ్రత్తగా పరిశీలించి అర్థము చేసుకోవాలని కోరుచున్నాము.

ఇంతవరకు జ్యోతిష్యశాస్త్రములో కాలచక్రము, కర్మచక్రము అను మాటలేలేవు, లగ్నము రాశులని పేరున్నా, వేటిని రాశులనాలో, వేటిని