పుట:Jyothishya shastramu.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నిర్ణయించబడినదని అర్థము. జననములోనే జరిగిన ఫతకము కావున దానిని జాఫతకము అనెడివారు. పూర్వము జాఫతకముగా పెట్టబడిన పేరు కాలక్రమములో జాతకముగా మారిపోయినది. జాఫతకము అను పేరులోగల రెండవ అక్షరమైన ఫ లేకుండా పోయి చివరకు జాతకముగా మిగిలిపోయినది.

నేడు కూడా ఒక మనిషి జీవితమును గురించి తెలియుటకు వాని పుట్టుకలోనున్న కాలమునుబట్టి జాతకమును (జాఫతకమును) చూచుట సాంప్రదాయముగా కలదు. జ్యోతిష్యులందరూ జాతకమును ఆధారము చేసుకొని చూచినా, చూచేవారిలో చాలామందికి కాలచక్రమేదో, కర్మ చక్రమేదో, రాశి ఏదో, లగ్నము ఏదో తెలియని దానివలన జాతక సమయములో ఏర్పరచబడిన కర్మలను సరిగా తెలియలేకపోవుచున్నారు. జ్యోతిష్యము అనుమాట జాఫతకము (జాతకము) నుండే ప్రారంభమగును. కావున జాతకము అను దానిని గురించీ, దానిని ఎలా తెలియాలోనను విషయమును గురించి ఇప్పుడు తెలుసుకొందాము.

34. త్రిరా లేక రాత్రి

కాలచక్రములో సూర్యుడు లగ్నముల మీద ప్రయాణిస్తూ ఒక్కొక్క లగ్నమును దాటుచూ కాలచక్రములోని మేషం, వృషభము మొదలగు లగ్నములను దాటుచూపోయి చివరకు మీన లగ్నమును దాటుటకు ఒక సంవత్సర కాలముపట్టునని చెప్పుకొన్నాము. కాలచక్రములో తిరుగు సూర్యుడు తన కిరణములను కర్మచక్రముమీద ప్రసరించునని చెప్పు కొన్నాము కదా! అలా కర్మచక్రము మీద సూర్యకిరణములు పడడమే