అనిపేరు. దీని లోపలిభాగము నంటి మగపూవులుండును. మధ్యభాగము నందును, పుష్పముయొక్క పీఠమునందును ఆడపూవులు పురుగు గ్రుడ్లవలె కానబడును.
రావిచెట్టుయొక్క పూవులును ఇట్లే కాయలోపల నుండును. రావిచెట్టుయొక్క పూవులను చూచినవారు లేరనియు, పర్వపుదినములలో రాత్రి రెండుయామములప్పుడు ఆ చెట్టుక్రింద కనిపెట్టియుండిన ఎప్పుడో ఒకప్పుడు తళుక్కున ఆచెట్టు పుష్పించి దానిపూవులన్నియు అకస్మాత్తుగా పిందెలుగానగుట జూడవచ్చుననియు, మంత్రములు అభ్యసించువారును, వనమూలికలు సంపాదించువారును, మోక్షముపొందుటకై ఉపదేశములు పొందువారును ఆ చెట్లక్రింద అట్టిసమయమునందు వానిని సంపాదించుకొనినయెడల అవి వారికి మిక్కిలి చక్కగ పట్టిచ్చుననియు వాడుకగలదు. ఇప్పు డీ రావిపూవులను చూచినవారలు పై జెప్పిన కట్టుకథలను విశ్వసింపరుగదా! చిన్నకత్తిని చేతబట్టుకొని యొక లేత రావిపిందెను రెండుసమభాగములగునట్లు తెగగోసి దానిమధ్యనుండు సన్నని నలుసులవలెకనబడు రావిపూవులను పరీక్షించినయెడల పై జెప్పబడిన సంశయము రూపుమాయును.
ఈ పై జెప్పబడిన కాయలు గాక యింక నెన్నెన్నియో కాయలు ఎన్నెనోమార్పులను జెందియుండును. ఇట్టిమార్పులన్నియు సంతానవృద్ధికొరకును, పుట్టినసంతానమునకు తరతరవ్యాప్తిగలుగ జేసికొనుటకును వృక్షములు చేయుప్రయత్నములు. ఈవిష