ఈ పుట ఆమోదించబడ్డది
గల పొరబీజకవచము. ఈబీజకవచములో నొకప్రక్కనుతీగెవలెనుండు తోకకలదు; ఇదియే కొనకాడ. సంయోగమయిన తరువాత కొన్ని ఆడపూగుత్తులుమాత్రమే తొనలగును. మరికొన్ని గుత్తులు కాడగాను నారవంటిభాగముగాను పరిణమించును; అనగా నివియన్నియు గొడ్డుపోయిన పూవులగును.
రావిపండు, మర్రిపండు, ఇవికూడపుష్పముల సమూహములచే నేర్పడినకాయలే. కాని, వీనియందలి పుష్పములు మిక్కిలి చిన్నవి. ఇవి మిక్కిలి యధికమైనమార్పులను జెందినవి. పుష్పముయొక్క తొడిమ పై భాగమునందుండు కర్ణిక మిక్కిలి హెచ్చైన మార్పులనుజెంది గిన్నెవలె నేర్పడి పూవులనన్నిటిని గిన్నెలోపల నిముడ్చుకొనినది.
102-వ పటములో పచ్చి మర్రికాయ నొకదానిని రెండు చెక్కలుగ కోసి అం దొక చెక్క యొక్క ఆకారమును చూపితిమి. కాయయొక్క పై కప్పుగా నున్నగిన్నెవంటిభాగము పూవుల గుత్తియొక్క తొడిమచివరనుండు కర్ణికనుండి పరిణమించినది. దీనికి వృంతపుచ్ఛము