Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యమై ఇంకను రెండుమూడు ఉదాహరణములుచూపి ప్రస్తుత మింతటితో నీగ్రంథమును ముగించెదము.

జాజికాయ మొదలగుకొన్ని కాయలకు చిన్న చిన్న తోకలుండును. ఈతోకలకు బీజపుచ్ఛమ లనిపేరు. జా పత్రి అనునది జాజికాయనంటియుండు బీజపుచ్ఛమే. ఆముదపుగింజయొక్క కొననంటి తెల్లని మొటిమవంటి భాగముండును 103-వ పటములో 1. చూడుము. ఈ భాగమునందు ఆముదపు శుద్ధిచేయబడి నిలవయుంచబడును. ఇదియును బీజపుచ్ఛమే.

చెట్టుయొక్క బహిరంగమైనభాగమును అలంకరించియుండు పూవులయొక్క సొగసును, ఈ పూవులు వేరువేరుగనుండి తగినంతయలంకారమును గలుగజేయ లేని యెడల గుత్తులుగుత్తులుగ గూడు స్వభావమును, విత్తనములను గాలిలో నెగరనెత్తుకొని పోవుటకు తగియుండు రెక్కలనదగు రోమముల యేర్పాటులను, తమ వంశాభివృద్ధికై పాటుపడువారికొరకు దాచిపెట్టబడినబహుమానము లనదగు తియ్యనిరసములను, పరీక్షించి చూచువానికి