Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బీజముతో నెట్లు సంయోగ మగునో తెలిసికొనవలయును. ఇందునకై స్థూలబీజము స్థూలబీజాశయమునందు ఎట్లిమిడియుండునో ముందు తెలిసికొనవలెను.

అండాశయము నొకదానిని నిలువున రెండుగా ఖండించి పరీక్షించునెడల దాని నిర్మాణమును దానియందలి స్థూలబీజాశయ నిర్మాణమును చూడగలము.