Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుంజము. తొ - స్థూలబీజాశయముయొక్క తొడిమ. బీ. పీ-స్థూలబీజాశయపీఠము. ఆ. పొ-ఆవరణపుపొరలు రెండు. గ-స్థూలబీజాశయగర్భము. పిం. తి-పిండతిత్తి. స్థూ. బీ-స్థూలబీజము. స. క-సహాయకణములు. ప్ర. క-ప్రతిపాద కణములు. ఉ. జీ-ఉపజీవస్థానము. సూ. రం-సూక్ష్మరంధ్రము. పు. గొ-పుప్పొడి గొట్టము. దీనిగుండ సూక్ష్మబీజము సూక్ష్మ రంధ్రమార్గమున స్థూలబీజమును జేరును.

స్థూలబీజాశయముయొక్క సూక్ష్మనిర్మాణము.

అండాశయముయొక్క పొట్ట (పొ), కొనకాడ (కొ.క), కొనదిమ్మ (కొ. ది) అను మూడుభాగములనుచూడుము. దాని పొట్టలోపల స్థూలబీజాశయము (Ovule) ఒకటి బీజబంధకమను తొడిమ (తొ) చే నంటియున్నది. ఈ తొడిమనంటియుండు చోటునకు ఆనవాలుగనుండు మచ్చను కందిగింజ మొదలగు అనేక గింజలయందు చూడవచ్చును. దాని వెలుపలి సరిహద్దున రెండుపొరలు (Integuments ఆ. పొ) గలవు. ఈ పొరల లోపలితట్టున మెత్తని గుంజువంటిపదార్థముండును. ఈ పదార్థమునకు స్థూలబీజాశయ గర్భము (Nucellus) అని పేరు. ఈపొరలు రెండును ఇరువైపుల బీజాశయముయొక్క పీఠ (Base) మను మొదటిభాగమున పుట్టి స్థూలబీజాశయగర్భముచుట్టును చివరవరకువ్యాపించి పై భాగమునమాత్ర మొక చిన్నరంధ్రమునువిడచి తక్కినభాగముల నావరించియుండును. ఈరంధ్రమునకే సూక్ష్మరంధ్రము (Micropyle) అని పేరు. స్థూలబీజాశయగర్భమునందు సూక్ష్మరంధ్ర సమీపమున నొక చిత్రమైనకణము గలదు. దీనికి పిండతిత్తి (Embryo Sac) యనిపేరు. ఈకణమునందు ఇతరకణములం దుండురీతినే ఆవరణపుపొర నంటి కొంతయును, కిరణములుగా కొంతయును