ఇట్టి దూత్యమునందు సూక్ష్మబీజము లనేకములు వ్యర్థపడిపోవును. ఈ నష్టమునకు సరిపోవునిమిత్తమే యిట్టి వృక్షములందు సూక్ష్మ బీజములు అమితముగ నుత్పత్తిజెందును.
3. నీరు.
నీటియందు పెరిగెడు కొన్ని జాతుల పుష్పములలో తమ్ము భరించు నుదకమే దూతగా నేర్పడి వాని వివాహసంబంధముల గూర్చును.
సంపర్కము.
సూక్ష్మ బీజము స్త్రీపత్రపు కొనయందలి దిమ్మమీదికి జేరుటకు సంపర్క మని పేరు. ఈ సంపర్కము (Pollination) రెండువిధముల గలుగుచుండుట జూచియుంటిమి.
(1) ఆత్మసంపర్కము (Self-Pollination):- ఒక పుష్పము నందలి సూక్ష్మ బీజములు ఆ పుష్పమునందలి స్త్రీపత్రపు కొన దిమ్మమీద కే జేరియుండుట.
(2) పరసంపర్కము (Cross-Pollination):- ఒక పుష్పముయొక్క స్త్రీపత్రపు కొనదిమ్మమీద ఇతరపుష్పములయొక్క పురుషబీజములు జేరుట.
ఈ రెంటిలో పరసంపర్కము మిక్కిలి తరుచుగ గలుగునదని చెప్పియుంటిమి.
పైని జెప్పబడిన రెండువిధములైన సంపర్కములలో నెవ్విధముచేతనయినను కొనదిమ్మమీదికి జేరిన సూక్ష్మ బీజము స్థూల