Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిణామరూపములు.

రావిచిగురుయొక్క కొనయందలి లేత యాకులు మొగ్గవలె నెట్లు ముడుచుకొని యున్నవో చూడుము. ఇట్లే అనేక పత్రములు సన్నముగను, పొడుగుగను రూపభేదములు జెందుచుండుట యొక విచిత్రము గాదు.

75-వ పటము.

రావిచిగురు

కింజల్కములు సామాన్యమైన ఆకులనుండి క్రమముగ నెట్లు పరిణమించెనో తెలిసికొనుట కొక యుదాహరణము చూపెదము. కలువపూవును చూడుము. దీని రక్షకపత్రములు ఆకుపచ్చనిరంగుగలిగి ఆకర్షణ పత్రములకును ఆకులకును మధ్య అంతస్తుగానున్నట్లు జెప్పియుంటిమి. ఆకర్షణపత్రములు ఆకులయొక్క పరిణామరూపములే యని పైనివ్రాసియున్నాము. మొగిలి పూవునందలి ఆకర్షణపత్రములు కొంచెమించుగ ఆకులవలెనే యుండునుగదా. ఎర్రకలువపూవును పరీక్షించిన యెడల నీ యాకర్షణ పత్రములు క్రమముగ పురుషపత్రములుగా నెట్లు మారునో, అట్లు మారునప్పుడు మధ్య ఎన్ని అంతస్తులుగల