Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యంటియుండునుగాని రాలిపోవు. కాన ఆకులను రాల్చుశక్తి బ్రతికియున్న చెట్లకేగాని చచ్చినచెట్లకు లేదని యెరుంగునది. ఆకులను రాల్చుటకు ప్రయత్న మొకయాకు కొనమొగ్గనుండి వికసింపకముందే ప్రారంభమై, ఆయాకు రాలిపోవుటకు పూర్వపు క్షణికమువరకు సంపూర్ణముగాకుండ నుండునని కనిపట్టబడునది.