దాని కనుగుణమైన పరిమాణము గలుగును. కాని యీపెంపు క్రొత్తకణములు పుట్టుచుండుటచేత గాదని గ్రహించునది.
ప్రథమమున మొటిమలో జేరిన పరిలింగములోని కణములలో కొన్నిటినుండి అంతర్లింగ మేర్పడి దానినుండి వాహికాపుంజములు పుట్టును. ఈయంతర్లింగము పిమ్మట శాఖయందలి అంతర్లింగముతో కలిసికొని శాఖనుండి ఆకులోని కేకమైనవాహికాపుంజము లేర్పడును.
ఆకు రాలుపు.
పత్రపీఠముయొక్క మొదటిభాగమున కొమ్మకును ఆకునకును మధ్య నడ్డముగ బెండుపొర (Cork layer) యొకటి పుట్టును. కొమ్మనుండి ఆకులోనికి వ్యాపించు వాహికాపుంజములలోని గొట్టముల నీ బెండుపొర యురిపోసినట్లుగా నొక్కి వానిరంధ్రముల మూసివేయును. అంతట ఆహారప్రసరణము లేనివై ఆకులు చచ్చి నేలబడును. ఇట్లీవాహికాపుంజముల రంధ్రములు నొక్కి వేయబడుటచేతనే ఆకులు రాలిపోయినప్పుడు వాని మొదళ్ళనుండు మచ్చలగుండ కణరసము (నీరు, పాలువంటి దేదియు) కారదు. ఆకురాలుపు-శీతోష్ణాదులయందలి యధిక భేదములచే గలుగుచున్నట్లు తెలియుచున్నది.
ఈయాకు రాలుపు చెట్టుయొక్క ప్రాణసంబంధమైన వ్యాపారమని యొక నిదర్శనమువలన తెలియగలదు. మన మొకకొమ్మను ఆకులసహితము నరికి యెండవేసినయెడల దానియాకులుకొమ్మ