పుట:Jeevasastra Samgrahamu.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాకు, కొబ్బెరఆకు మొదలగునవి. బహుకాష్ఠములలో తాటి ఆకు, చేమాకు మొదలగునవి.

2. జాలాకారవ్యాపకము (జాలము-వల) - ఇందు పిల్లయీనెలన్నియు వలయల్లికలవలె నల్లుకొనియుండును. ద్విబీజదళవృక్షముల ఆకులన్నియు నీ తరగతిలోనివి. ఉదా:- ఏక కాష్ఠము-రావి యాకు; బహు కాష్ఠము-ఆముదపాకు మొదలగునవి.

ఆకుయొక్క ఉత్పత్తి.

ఇది కొమ్మచివరనుండు అంత్యవిభాజ్యమునుండి యొక చిన్న మొటిమగా నంకురించును. ఈమొటిమలో బాహ్యలింగము, పరిలింగముమాత్రము జేరియుండును. మొట్ట మొదట మొటిమయందలి కణములన్నియు విభజనాశక్తి గలిగియుండును. కాని కొంతవరకు ఆకుయొక్క ఆకార మేర్పడినతోడనే, ఆకుమధ్యనుండు కొన్నికణములు మాత్రము విభజనాశక్తి గలవై తక్కినకణములన్నియు విభజింపబడక పరిమాణమునందు మాత్రము పెరుగుచుండును. తుదకు ఆకునందలి కణములన్నియు నేర్పడినతరువాత మధ్యనుండు కణములకుగూడ విభజనాశక్తి లేకపోవును.

ఇట్టిస్థితికి రాగనే ఆకు పెద్దదై నదని మీరు తలచరాదు. ఇంతవరకు ఆకు చుట్ట చుట్టుకొని కొనమొగ్గలో తక్కినలేతయాకులమధ్య ముడుచుకొనియుండెడు చిన్నరూప మేర్పడును. తరువాత నది వికసించి దానియందలి ప్రతికణమును పెరుగుటచే