Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. ఏకకాష్ఠము.

కొన్నియాకులలో మధ్యఈనె యొకటుండి దానినుండి చిన్న చిన్న ఈనెలు పుట్టి అవి ఆకునంతటను అలుముకొనియుండును. ఈ యీనెయే ఆకును నిలువబెట్టుటకు శక్తి నిచ్చెడు ఊతపుకర్ర వంటిది. ఇట్లు ఒంటియీనె గలయాకులకు ఏక కాష్ఠములు అని పేరు. ఉదా:- రావియాకు, అరటియాకు.

2. బహుకాష్ఠము.

కొన్నియాకులలో మధ్యఈనియే యుండక తల్లికాడ ఆకులో ప్రవేశించినతోడనే అనేక ఈనెలుగా చీలి వానినుండి పిల్ల యీనెలు పుట్టి అవి ఆకునంతటను అల్లుకొనును. అట్టియాకులు బహుకాష్ఠములు. ఉదా:- ఆముదపాకు, తమలపాకు, చేమాకు మొదలగునవి చూడుము.

పిల్లయీనెల వ్యాపకము.

ఏకకాష్ఠములందును, బహుకాష్ఠములందునుగూడ పిల్ల యీనెల వ్యాపకము రెండువిధములుగ నున్నది.

1. సమాంతరము (Parallel)

2. జాలాకారము (Reticulate).

1. సమాంతర వ్యాపకము:-పిల్లయీనె లొకదానితో నొకటి యలుముకొనకుండ యొక దానిప్రక్క నొకటి సమాంతరముగ వ్యాపించుట. సామాన్యముగా నేకబీజదళవృక్షముల ఆకులన్నియు నీ తరగతిలోనివే. ఉదా:- ఏక కాష్ఠములలో అరటి