Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహిశ్చర్మము.

చేమఆకు తమలపాకులవలె కొంచెము దళసరిగలఆకును దేనినైను చేతబట్టుకొని దాని రెండువైపులను పరీక్షించి చూడుము. అందు క్రిందివైపు ఎదో సులభముగ తెలిసికొనవచ్చును. అట్లు తెలిసికొనిన పిమ్మట నా యాకును పైవైపు పై నుండునట్లుగా చేత బట్టుకొని, కొంత యాకును వెనుకకు విరిచి పర్రున చింపుము. అట్లుచింపగా చిరిగిన ముక్కలయొక్క క్రిందితట్టున తెల్లనగు మిక్కిలి పలుచని పొర యొకటి చిరుగు అంచుల వెంబడిని అక్కడక్కడ అంటియుండును. ఇది ఆ యాకుయొక్క క్రిందివైపు బహిశ్చర్మపుపొర. ఇం దొక చిన్నముక్కను సూక్ష్మదర్శినిలో పరీక్షించునెడల దానియందలి నోరులనిర్మాణము చక్కగ తెలియగలదు. అట్టి పొరయొక్క నిర్మాణమును చూపు 62-వ పటము

చూడుము. అందు (నో). అనున దొక-నోరు. ఈ నోటికి రెండువైపులను పెదవు లనబడు రెండుకణములు గలవు. ఆ పెదవులు