ఈ పుట ఆమోదించబడ్డది
పత్రదళము:- సామాన్యముగా నన్ని యాకులందును పై తట్టునకును క్రిందితట్టునకును భేదము గన్పట్టుచుండును. ఇందు
ఆకుయొక్క సూక్ష్మనిర్మాణము తెలుపునది.
బ1 - ఆకుయొక్క పైతట్టున నుండెడు బహిశ్చర్మము.
హ - హరితకములు. ఇవి ఆకుయొక్క గుంజులోని ప్రతికణమునందును పెక్కు లుండును. ఇవి నల్లనిచుక్కలుగా చూపబడినవి.
గోడ - ఇందు పొడుగుగనుండు మృదుకణము లొండొంటినడుమ సందులు లేకుండున ట్లమరియున్నవి.
గుల్ల - ఇందలి కణములమధ్య శూన్యస్థలము లనేకములు గలవు.
బ2 - ఇది ఆకుయొక్క క్రిందితట్టుననుండు బహిశ్చర్మము.
నో - నోరు. పె,పె - పెదవులు. పెదవికణములలో తప్ప బహిశ్చర్మమునందలి యితరకణములందు హరితకము లుండవు.