Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు కారణము దాని సూక్ష్మనిర్మాణమును పరీక్షించిన తెలియగలదు. ఒకయాకునుండి అడ్డముగ ఖండింపబడిన యొక సూక్ష్మమైన తునకయొక్క ఆకారము సూక్ష్మదర్శనిలో చూచునప్పుడు 61-వ పటములో జూపినట్లుండును.

1. పైతట్టునను క్రిందితట్టుననుగూడ నొకవరుస బల్లపరుపైన కణముచే నేర్పడిన పొరలు గలవు. ఇవి రెండును బహిశ్చర్మపు కణములపంక్తులు. ఈ రెండు పొరలమధ్య ఆకుయొక్క గుంజు (Mesophyll) అను పదార్థము గలదు.

2. పైవైపుననుండు బహిశ్చర్మ కణములవరుసకు లోపలితట్టున నొకవరుస పొడుగైనకణము లొక దానిసరస నొకటి యమరియుండు గోడవలె నేర్పడియుండును. ఈ కణములమధ్య నందు లుండవు. ఈ కణములు బహిశ్చర్మకణములకు సమకోణములు గలవిగా నుండును. ఈ గోడయే గుంజునకు పై సరిహద్దు.

3. ఈ గోడకు లోపలితట్టున, నిర్ణియమైన ఆకారము లేనట్టియు, కొంచెము గుండ్రనైనట్టియు కణములు గుల్లగ నుండునట్లు అనగా కణములమధ్య సందులు మిగిలిపోవునట్లుగా చిమ్మబడియుండును. ఈ సందులన్నియు నొకటినొకటి కలిసికొని తుద కాయాకుయొక్క క్రిందిభాగముననుండు బహిశ్చర్మపుపొరలో నుండునోరు (Stomata) లనబడు సందులగుండ వెలుపలనుండు గాలితో సంబంధము గలిగియుండును.

4. గోడయందలి కణములును, గుల్లయందలి కణములును గూడ మృదుకణములే. వీని మూలపదార్థమునందు హరితకము