వరకు అనేక భాగములుగా చీలియుండును గాని యా చీలికలు కాడవరకు వ్యాపించియుండవు. ఇట్టియాకులు లఘుపత్రములే. ఉదా:- ఆముదపుఆకు (41-వ పటము).
కొమ్మకును ఆకునకునుగల భేదములు.
కొబ్బెరాకు, తురాయిఆకు మొదలగు మిశ్రమపత్రములను కొందరు కొమ్మలేమోయని భ్రమింతురు. కాని మిశ్రమపత్రమునకు కొమ్మకు గల యీక్రింది నాలుగుభేదములను పరిశీలించిన నావివరము తెలియగలదు.
1. మిశ్రమపత్రమునకు శాఖాంకుర మనబడుకొనమొగ్గ లేదు.
2. మిశ్రమపత్రము కొమ్మనుండి యుత్పత్తియగుచోట దాని పంగలో నొక శాఖాంకురమను చిన్న మొటిమ యుండును.
3. మిశ్రమపత్రము మరియొక ఆకుయొక్క పంగలో పుట్టదు.
4. మనము ఆకులని వాడెడు చిట్టిఆకుల పంగలలో శాఖాంకురపు మొటిమ ముండవు.
సూక్ష్మనిర్మాణము.
కాడ:- కాడయొక్క సూక్ష్మనిర్మాణమును కొంచె మించు మించుగ శాఖయొక్క నిర్మాణమును బోలియుండును. దీనిగుండ నొకటిగాని యంతకు హెచ్చుగాని వాహికాపుంజములు కొమ్మనుండి పత్రదళములోనికి వ్యాపించియుండును. ఇవి పత్రదళములో ప్రవేశించి యనేక చిన్న చిన్న వాహీకాపుంజములుగా చీలి యాకులయందలి నులుయీనె లగును.