చుండును (57-వ పటము చూడుము). ఇట్టినులితీగెలలో కొన్నిశాఖలయొక్క రూపాంతరములని యిదివరలో జెప్పియున్నాము (248- వ పుటచూడుము).
6. ఆదోకదళములు:- కొన్ని యాకులయొక్క అంచులును కొనలును మొనలుతీరి ఎదిగి ముండ్లుగా మారి ఆత్మ సంరక్షణము జేసికొనును. ఉదా:- మొగలి, కిత్తనార మొదలగునవి.
7. మాంసభక్షకదళములు:- ఇవిగాక యింకను మిక్కిలి చిత్రమైన ఆకులు కొన్నిగలవు. అం దొకటి రెండుమాత్రము ఉదాహరింపబడును. మాంసభక్షక (Carnivorous) వృక్షములు కొన్ని గలవని వ్రాసిన మీకు చిత్రముగ దోచవచ్చును. కూజా చెట్టు (Pitcher Plant) అను నొక మొక్క గలదు. ఈ మొక్క యొక్క ఆకులు కూజాలవలె పొట్టయును గొట్టమును గలిగియుండును. ఆకూజాలో అడుగుభాగమున నా చెట్టునుండి స్రవించిన ఏదోయొక జీర్ణరస ముండును. కొన్నిపురుగు లారసములో బడి మునిగి దానిశక్తిచే జీర్ణమై ద్రవపదార్థములుగా మారును. అట్లు జీర్ణమైనపదార్థముల నాయాకులద్వారా ఆ మొక్కగ్రహించును. ఇది వృక్షజాతుల కొకవింతయైన ఆహారపద్ధతిగా గ్రహింపనగును.
పురుగులను పట్టి తిను శక్తిగల వృక్షము లింకను కొన్ని గలవు. అమెరికా దేశములో సూర్యబిందువు (Sun Dew) అను వృక్షము గలదు. దాని ఆకుచుట్టును గుండ్రని పులిపిరికాయలవంటి చిన్నచిన్న మొటిమలు వరుసగా నంటియుండును. వీనినుండి