టిలో మొక్క యొక్క ఆహారపదార్థములు నిలువ జేయబడియుండుటచేత నవి దళముగా నుండును.
3. హరితదళములు:- ఇవి సర్వసామాన్యమైన ఆకుపచ్చని ఆకులు. ఇవి యాహారముల తయారు జేయునట్టియు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసవ్యాపారముల జరుపునట్టియు అవయవములు. ఇందు హరితకములు ముఖ్యాంగములు. ఈ యాకులసూక్ష్మనిర్మాణమును గూర్చి ప్రత్యేకముగ వ్రాయబడును.
4. పుష్పదళములు :- ఇవి పూవులయొక్క పలువిధములై నట్టియు పెక్కురంగులుగలయట్టియు రేకులు. ఇవి మిక్కిలి చిత్రముగ మారినఆకులే. ఇవి సంతానవృద్ధివిధానమునకు సహాయభూతములుగానుండుట కేర్పడినవి. ఇట్టి తమవ్యాపారముల నెరవేర్చుటకై యివి అనేకవిధముల మార్పుల జెంది, యనేకరంగులు గలవిగను, అనేక పరిమాణములు గలవిగను ఉండును. ఈ యాకులగూర్చి ముందు ఒకప్రకరణము వ్రాయదలంచి యిక్కడ విస్తరించలేదు.
5. లతాదళములు :- కొన్ని తీగెల యందలి ఆకులలో కొన్నిటి యొక్క చివరభాగములు నులితీగెలుగా మారగా యా నులితీగెల ఆధారముచే నితర వస్తువుల నానుకొని తల్లితీగె పై కెక్కు