Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొక జిగురుపదార్థ మెల్లప్పుడు స్రవించు చుండును. ఈయాకున కేదైన పురుగు తాకగానే అది యీ మొటిమలకంటుకొనిపోవును. తోడనే ఆ యాకుయొక్క అంచులుచుట్టుకొనిపోయి ఆకంతయు నొక చిన్నబుట్టగా నగును. ఆ బుట్టలో నా పురుగు చెరబట్టుకొనబడి చచ్చును. అంతట నది క్రుళ్లి యా రసములో జీర్ణమయి మొక్కయొక్క ఆహారముగా చేకొనబడును.

ఆకుల ఆకారము.

ఆకుల ఆకారమును వర్ణించుచు ఎన్నిపుటలు వ్రాసినను వ్రాయవచ్చును. ఇవి అనేక ఆకారములు గలవి. కొన్ని అరటి కొబ్బెర మొదలగు ఆకులవలె పొడుగుగను, కొన్ని తామరాకులవలె గుండ్రముగను, పరుపుగను, కొన్ని జొన్న చెరుకు ఆకులవలె కోసు (ఆదోక) గను, కొన్ని సరుగుడు చెట్ల (Casuarina) ఆకులవలె సూదుల వలెను ఇంక నెన్నెన్నియో ఆకారములుగలవి. సామాన్యముగా ఆకులు పలుచగ నుండును గాని కలబంద ఆకులవంటివి కొన్ని రసపూరితములై దళముగ నుండవచ్చును. కొన్ని కిత్తనార ఆకుల (మట్టల) వలె నారగలిగినవై దృఢముగ నుండవచ్చును.

ఆకులయొక్క ప్రసారము.

ఇది శాఖలప్రసారమువలెనే రెండువిధములు (240-వ పుట చూడుము). (1) కిరణప్రసారము. ఉదా:- జామిఆకులు, తులసిఆకులు మొదలగువానిప్రసారము. (2) సర్పప్రసారము. ఉదా:- రావి, మామిడి మొదలగువాని ఆకులప్రసారము.