Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) పత్రమధ్యము.

ఇది మధ్యభాగము. దీనికి కాడయని పేరు. ఇది పత్రపీఠమునకును మూడవభాగమగు పత్రదళమునకును మధ్యనున్న భాగము. పత్రమధ్యము సామాన్యముగా గుండ్రముగ నుండును. దీని పైతట్టున తరుచుగ పొడుగునను కొంచెము పల్లముగనుండు నొక చాలువంటి భాగముండును.రావిఆకు నంటియుండు కాడయొక్క యుపరితలమున చూడుము. ఏకబీజదళవృక్షములందు సామాన్యముగను, అక్కడక్కడ కొన్ని ద్విబీజదళవృక్షములందును ఈకాడలోపించియుండును. అనాస, కలబంద మొదలగువాని ఆకులు చూడుము. కొన్నియెడల పత్రమధ్యమునుండి కూడ చిన్న చిన్న రెక్కలవలెనుండు ఉపదళము లుండవచ్చును. ప్రక్కపటములోని పంపరపనస దబ్బ మొదలగువాని ఆకును చూడుము.

(3) పత్రదళము.

ఇది ఆకునందు ముఖ్యభాగము. చివరనుండు పలుచని రేకు వంటిది. ఒకానొకప్పుడు ఈ భాగముకూడ విస్తరించక పత్రమధ్య