పుట:Jeevasastra Samgrahamu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

ఆకు (The Leaf)

ఇది చెట్టుయొక్క ఆహారములో చాలభాగమును సంపాదించుటకును, ఉచ్ఛ్వాసనిశ్శ్వాస వ్యాపారముల జరుపుటకును, ప్రత్యేకముగా నిర్మింపబడినభాగము. ఇట్టిపని నెరవేర్చుటకు తగినట్లు దాని ఆకారమును నిర్మాణమును ఏర్పడియున్నవి. ఆకునందు మూడుభాగములు గలవు.

పత్రపీఠము

అందు మొదటిభాగము అనగా కొమ్మ నంటియుండుచోటు కొంచెము లావుగ నుండును. ఈభాగమునకు పత్రపీఠము (Leaf base) అని పేరు. (55-వ పటములో పీ.చూడుము). ఏకబీజదళవృక్షములలో పత్రపీఠము సామాన్యముగా వెడల్పుగ నుండును. కొబ్బెరమట్టయొక్క మొదలు చూడుము.