పుట:Jeevasastra Samgrahamu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నకణములలో కొన్ని విభాజ్యకణములుగా పరిణమించి యవి చీలి బెండు (Cork-కార్కు) కణముల సంహతి యేర్పడును. ఈ బెండుకణములు గాయమునకు సంరక్షణపుపొరగా నేర్పడి లోపలనుండి వెలుపలికిగాని వెలుపలనుండి లోపలికిగాని నీరు గాలి మొదలగునవి వ్యాపించకుండ జేయును. ఇట్లు గాయముల మాన్పుకొనుశక్తి రెండుజాతులవృక్షములకును గలదు.