Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాపుంజములందలి దారుత్వక్కులమధ్య విభాజ్యముగలదని యిదివరలో చదివియున్నాము. కొన్నిచో పట్టయందు వెలుపలనుండు బెండు (Cork) పొరలోగూడ విభాజ్యకణము లుండును. వీనిలో అంత్యవిభాజ్యము చెట్టుయొక్క వృద్ధికి ముఖ్యమైనదిగా నున్నది. తక్కినరెండును చెట్టుయొక్క లావును హెచ్చించును. కొద్దికాలములోనే పై జెప్పిన అంత్యవిభాజ్యముయొక్క విభాగమువలన నైన కణములు మూడుసంహతులుగా నేర్పడును.

(1) అందు వెలుపలిది 54-వ పటములో (బ.) అనుచో జూపినప్రకార మొక్కకణము దళసరిని అమర్చబడిన చుట్టునుండు కణపం క్తి. దీనికి బాహ్యలింగము (Dermetogen) అనిపేరు. ఈ పం క్తి యందలి కణములు అడ్డముగ నేగాని నిలువున చీలవు. అనగా ఎల్లప్పుడును ఒక కణముదళసరినే యుండును. ఈకణ పం క్తియే బహిశ్చర్మ మగును.

(2) బాహ్య లింగమునకు లోపలితట్టున పరిలింగము (Pereblem) అను భాగము గలదు (54-వ పటములో ప). ఇది శిఖర సమీపమున ఒక కణము వరుసనే యుండును. కాని యాకణములు వివిధములుగ వరుసక్రమము లేక విభజింపబడుటచే క్రిందిభాగములయందు అనేక వరుసలుగ నేర్పడియుండును. ఈభాగము