పుట:Jeevasastra Samgrahamu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండి పట్టయందలి కణములన్నియు నేర్పడుచున్నవి. ఆకణములవరుస లన్నిటిలో లోపలివరుసయే అంతశ్చర్మ మగును.

(3) పరిలింగమునకు లోపలితట్టున నున్న భాగమునకు అంతర్లింగము (Plerome) అని పేరు (54-వ పటములో అం). ఇది విభాజ్యకణముల నట్టనడిమిభాగము. ఇది లింగాకారముగ నుండును. దీనినుండి వాహికాపుంజములు, దవ్వ, కిరణములు-ఇవియన్నియు నేర్పడుచున్నవి. మన మిప్పుడు చదువుచున్న పూవులను భరించు వృక్షముల కొమ్మలో నిట్టి అంతర్లింగ మొక్కటియే యుండును. ఫెరనులు (Ferns) అను పూవులు లేని వృక్షములలో నొక్కొక కొమ్మకు అనేక అంతర్లింగము లుండును.

శాఖలయుత్పత్తి.

శాఖలు మొట్ట మొదట పరిలింగ బహిర్లింగములయొక్క చిన్న చిన్న మొటిమలుగా పుట్టును. మొట్ట మొదట ఈ మొటిమలో అంతర్లింగము చేరియుండదు. క్రొత్తమొటిమయొక్క పరిలింగమునుండి కణములు చీలి దానినుండియొక అంతర్లింగ మేర్పడును. తరువాత నీ యంతర్లింగము తల్లికొమ్మయొక్క యంతర్లింగముతో కలిసిపోవును.

గాయములు.

చెట్టుయొక్క కొమ్మ కెక్కడనైనను హానికలిగి గాయము పడినప్పుడు ఆ గాయములో నన్నిటికంటె వెలుపలనున్న జీవించి