అనగా నదియును చిగురాకులచే గప్పబడి మొగ్గవలె నుండును. ఈచిగురాకుల నన్నిటిని సాధ్యమైనంతవరకు ద్రుంచి, వానిలోపల నున్న లింగాకారమగు భాగమును నిలువున మిక్కిలి పలుచనవగు తునకలుగాచీలి, యాచీలిక నొక దాని సూక్ష్మదర్శనిలో పరీక్షించిన,
ప్రక్క పటములోజూపిన యాకారము గన్పట్టును. హెచ్చుజాతి వృక్షములందు నాచుమొక్కయందువలె అంత్య కణము లేదు. దీనికి బదులుగా కొన్ని లేతకణముల సముదాయము గలదు. (53-వ పటము చూడుము). ఈకణములరాశికి అంత్యవిభాజ్య మని పేరు. విభాజ్యమనగా విభజింపబడునది. ఈవిభాజ్యమునందలి కణములు నిరంతరము ద్విఖండన విధానముచే చీలుచుండును. ఇట్లు చీలుటవలన నేర్పడినకణములు పైపటములో జూపినప్రకారము ప్రథమమున అన్నియు నొక్కరీతిని నలుచదరముగ నుండును. ఇవియన్నియు నొక్కరీతినే మూలపదార్థముతో పూరింపబడి మిక్కిలిపలుచని కణకవచములుగలిగి యుండును. అనగా నీభాగమునందలి కణములన్నియు నెల్లప్పుడు మృదుకణములే యనుట. ఏయేభాగములందు వృక్షము పెరుగుచుండునో ఆయాభాగములందు విభాజ్యకణము లుండును. వాహి