ఈ పుట ఆమోదించబడ్డది
8. నులితీగెలు (Tendrils):- నిలువబడుటకు శక్తిలేని పొట్ల, కాకర మొదలగుతీగెలయందు పుట్టి, వాని వ్యాపకమునకు ఆధారభూతములుగ నుండు నులితీగెలుసహితము కొమ్మయొక్క రూపాంతరములే.
ఇవి తీగెను నేలబడిపోకుండ జేయుటకై తమకు దొరికిన వస్తువులనన్నిటిని ఆశ్రయించి వాని కా తీగెను చేర్చి కట్టును. వీని కొనలకు స్పర్శ జ్ఞానము గలదు.
ఇంతవరకు కొమ్మయొక్క ఆకారమును ఉపయోగమును గూర్చి చెప్పితిమి. దాని సూక్ష్మనిర్మాణమునుగూడ సంగ్రహముగ వివరింతుము.
శాఖయొక్క సూక్ష్మనిర్మాణము.
ప్రతి కొమ్మయొక్కయు చిట్టచివర శాఖాంతము లేక కొనమొగ్గ యను లేతయాకులచే కప్పబడియుండు మొగ్గవంటిభాగము