Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారిపర్ణి, నాచుమొక్కల యందువలెనే పెద్దవృక్షములయందు గూడ ఉండును. దీని నిర్మాణవిషయమై క్రింద వివరించెదము. ప్రస్తుతము దాని క్రిందిభాగముననుండు లేతకొమ్మనుండి కొన్ని సూక్ష్మములగు తునకలను ఖండించి వానిని సూక్ష్మదర్శనిలో పరీక్షించి కొమ్మయొక్క సూక్ష్మనిర్మాణమునుగూర్చి కొన్ని అంశముల తెలిసికొనవలయును.

ఏకబీజదళ వృక్షములకును ద్విబీజదళవృక్షములకును సూక్ష్మ నిర్మాణమునందు కొన్ని భేదములు గలవు. ఏకబీజదళ వృక్షములలో ఆకులమీద నుండు పిల్ల ఈనెలు ఒక దాని కొకటి సమాంతరములుగ (Parallel) ఉండును. ఉదా:- అరటాకు. ద్విబీజదళవృక్షములలో నవి వలయల్లికవలె నుండును. ఉదా:- ఆముదపాకు. ఈ వాహికాపుంజముల నిర్మాణమునందలి భేదములచేతనే కొమ్మ యందలి ముఖ్యభేదములును ఏర్పడుచున్నవి.

1. ద్విబీజదళశాఖ.

ప్రథమమున ద్విబీజదళవృక్షముయొక్క లేతకొమ్మనుండి సన్ననితునకల ఖండించి వానిని పరీక్షించిచూతము. 49-వ పటములో జూపబడిన శాఖయొక్క అడ్డపుచీరికల ఆకారమును శ్రద్ధగ గమనింపుము.