పటములోచూపిన ఆముదపాకులో 9 తల్లిఈనెలు గలవు. దానినుండి చిన్నచిన్న నారపోగులవలె పిల్లఈనెలు అనేకమార్గముల వ్యాపించి వల అల్లికవలె దట్టముగ అల్లుకొనియుండును. ఈ రెండువిధములైన ఈనెల యల్లికలుగల రెండుజాతుల వృక్షములగూర్చి ముందు వివరింపబడును. ఈ యీనెలయందు పై జెప్పిన కాలువలు గలవు. ఈ వాహికలు ఆకుయొక్క కాడద్వారా ఆయాజాతుల కేర్పడియున్న నిర్ణయరీతిని కొమ్మలగుండ వేళ్ళచివరలవరకు బోవుచుండును.
వాయుమార్గములు.
పైని జెప్పినప్రకారము కణములలోపల కాలువలుగా నేర్పడినమార్గములుగాక కణములవెలుపల ఆయాకణముల మధ్యనుండు సందులను ఒండొంటితో జేర్చి చెట్టుపొడుగునను వంకర టింకరలుగా వ్యాపించుమార్గములును గలవు. (ప్రక్కపటము చూడుము). ఇవి వృక్షమునందు సర్వదా వ్యాపించు చుండెడు ప్రాణవాయువు, బొగ్గుపులుసుగాలి, నీటియావిరి మొదలగు వాయువుల శీఘ్రప్రచారములకు మిక్కిలి యుపయుక్తములుగ నుండును.
హెచ్చుజాతి వృక్షములన నెవ్వి?
హెచ్చుజాతి వృక్షములయొక్క సూక్ష్మనిర్మాణములను వివరముగ వర్ణించుట కిచ్చ టెడములేనందున వానిని