పుట:Jeevasastra Samgrahamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానినన్నిటిని బేర్కొనుటకే యనేకపుటలు కావలెను. జ్ఞాన మభివృద్ధియైన కొలదిని శాస్త్రములసంఖ్య హెచ్చుచున్నది. ఒకకంటిని గుఱించి యనేకగ్రంథములు గలవు. చీమనుగుఱించి యొకశాస్త్రముగలదు. మనయాంధ్రభాష యభివృద్ధియైనకొలదిని యీశాస్త్రము లన్నియు దెలుగున బ్రకటింప బడునని నమ్ముచున్నాము.

ఇట్లు ప్రకృతిశాస్త్రములను గుఱించిన సామాన్యసిద్ధాంతముల దెలిసికొని, ప్రస్తుతగ్రంథములోని సంగతు లెట్టివియో కనుగొందము.

జీవశాస్త్రము.

సచేతనములనియు అచేతనములనియు మన మీసృష్టియందు బదార్థములలో రెండు భేదముల జూచుచున్నాము. సచేతనములకు సజీవములనియు అచేతనములకు నిర్జీవములనియు నామాంతరములు. సచేతనములను గుఱించిన శాస్త్రమునకు జీవశాస్త్రమని పేరు. జీవము, ప్రాణము అను శబ్దములు సమానార్థకములు. ప్రతిసజీవపదార్థమును జడపదార్థమగు దేహముతో గలసి వ్యక్తమగునే కాని, జడమునువిడచి స్వతంత్రముగా గానరాదు. కావున జీవశాస్త్రమునందు శరీరముద్వారా వ్యక్తమగు జీవమును గుఱించి విచారింపబడునే కాని, దేహమును విడచిన జీవము అతీంద్రియము కావున అందునగుఱించి యిందు వివరింపబడదు. జీవుడనువాడు వేరొకడు కలడా? లేక సర్వేంద్రియ వ్యాపారసమూహమే జీవుడా? మరణానంతరము జీవు డేమగును? అను విషయములన్నియు అతీంద్రియములు. కావున వానితో జీవశాస్త్రమునకు నేమియుబనిలేదు. వేదాంతశాస్త్రము లందునగుఱించి చర్చించునుగాత.

మన యింద్రియములకు గోచరమగు సచేతనముల శరీరనిర్నాణమును (Morphology), ఇంద్రియ వ్యాపారమును (Physiology), జీవులయొక్క శరీరరచన ననుసరించి మనోవికారభేదములను (చిత్తవృత్తులను Mental Phenomena) బట్టి జీవులలో నేర్పడుచున్న తరగతులును (Classes), భిన్న తరగతులలోని జీవులకుగల సంబంధమును కనుగొనుటయు, జీవశాస్త్ర