పుట:Jeevasastra Samgrahamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. రసాయన శాస్త్రము (Chemistry) - ఇది సృష్టిలోనున్న జడపదార్థముల నన్నిటిని బరీక్షించి యేయే పదార్థములలో మఱి యేయే పదార్థములు కలిసి యున్నదియు, ఏయే పదార్థములు తత్వద్రవ్యము (Rlements) లయినదియు దెలుపు శాస్త్రము. ప్రయోగపద్ధతిచే బదార్థముల నన్నింటిని బరిశోధించి చూచి వానిలో డెబ్బది మాత్రము తత్వద్రవ్యములు, అనగా నితర పదార్థమేదియు దమలో గలసి లేక స్వయంసిద్ధముగ నున్న వనియు, నెన్ని యుపాయముల బన్నినను పృథక్కరణమునకు (Analysis) లోబడనివి అగుననియు, కడమ పదార్థములన్నియు మిశ్రద్రవ్యములు, అనగా ఈ డెబ్బది తత్వద్రవ్యముల భిన్న భిన్న సంయోగీకరణముచే బుట్టినవనియు శాస్త్రజ్ఞులు సిద్ధాంతీకరించిరి. ఈయంశములును, మిశ్రపదార్థములను తత్వద్రవ్యముగా మార్చుపద్ధతియు, తత్వద్రవ్యముల గలిపి మిశ్ర పదార్థములను జేయు విధమును ఈశాస్త్రమునందు విశదీకరింప బడును.

పైన జెప్పబడిన రెండు శాస్త్రములును అనగా పదార్థవిజ్ఞాన రసాయన శాస్త్రములు సకల శాస్త్రములకును మూలాధారములు. కావున ప్రకృతిశాస్త్రముల నభ్యసించువారు వీనిని తప్పక మొదట జదువవలెను. ఈ రెండు గ్రంథములును మాచదువరులకు మేము కొలది కాలములలోనే యియ్యగలము.

3. భౌతిక భూగోళము (Physical Geography) - ఈ భూగోళముమీద స్థలభాగములోను, జలభాగములోను ఎల్లప్పుడును జరుగుచున్న మార్పులును వాని కారణములును ఇందు వివరింపబడును.

4. భూగర్భ శాస్త్రము (Geology) - ఇందు భూగర్భములోని పొరలను (Strata) గుఱించియు, వాని ననుసరించి భూమియొక్క యాదిమాకారమును, గుఱించియు తరువాత నది పెరిగిన విధంబును, భూమిమీద ఏయే వృక్షజాతి యేయే జంతుజాతి యెప్పుడెప్పు డావిర్భవించినదియు మఱి య నేక విషయములును వివరింపబడి యుండును.

ఇట్లిచ్చట ముఖ్య శాస్త్రములను బేర్కొంటిమి. శాస్త్రము లనంతములు