పుట:Jeevasastra Samgrahamu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలగు వానియందు తియ్యనిపానకముగను, నిమ్మ మొదలగువానియందు పుల్లనిరసముగను, నువ్వు, ఆముదము మొదలగువాని గింజలయందు చమురుగను ఏర్పడియుండును. కణమునందలి పదార్థముయొక్క మార్పులచేతనే ధాన్యాదులయందు నులువజేయబడు వరిపిండి (Starch)

మాంసకృత్తు (Proteid) మొదలగుపదార్థములు తయారగుచున్నవి. (ఫ్రక్కపటము చూడుము). ఈ మార్పులచేతనే అనేకపుష్పములయొక్క చిత్రవిచిత్రమైన రంగులేర్పడుచున్నవి. ఈ కణములచే విసర్జింపబడు పదార్థమునుండియే నల్లమందు మొదలగు విషములును పలువిధములయిన అత్తరువు లందలి సువాసన ద్రవ్యములును పుట్టుచున్నవి. ఇట్టి అనేకాంశములు మిక్కిలి యుపయోగకరము లయ్యును గ్రంథ విస్తరభీతిచే నిం దుదాహరింపబడవయ్యెను.

కణము లైక్యమగుట.

కణములయొక్క అనేకములగు వరుసలు చిక్కులుచిక్కులుగా నల్లుకొనుచు పెరుగునప్పుడు, అందుకొన్ని కణములయొక్క కవచము లొకానొకప్పుడు పగిలి హరించిపోవును. అంతట సమీపముననుండు కొన్నికణములు కలిసి ఏకకణము కావచ్చును.