ఒకానొకప్పు డొక్క చోట నుండు కొన్ని కణములరాశి మొత్తముగా చితికిపోయి వాని కణపదార్థమంతయు నితరకణములలోనికి క్రమముగ వ్యాపించి కణకవచములు హరించిపోవచ్చును. ఈ కణము లాక్రమించియుండినచోటు అట్టిస్థితిలో శూన్యముగా నుండిపోవును. ఇట్లు లేతమొక్కయం దొక్కొకకణము నశించి పోవుటచేత దానిసంతతి కాదలచిన కణములన్నియు లేకపోవును.
కాని వానికొర కేర్పడియున్న స్థలముమాత్రము శూన్యముగా నిలిచిపోవును. ఈ శూన్యస్థలములే చింత, మామిడి మొదలగు పెద్దవృక్షములలోని వికృతాకారముగలతొర్రలు (38-వ పటము చూడుము). ఈ ప్రకారమే వరుసగనుండు కణముల రాసులు కొన్ని నశించుటచే టేకు మొదలగు పెద్దమ్రాకులయందుండు నిలువురంధ్రము లేర్పడుచున్నవి.
దారువాహికలు.
ఇవిగాక ఒక్కటే వరుసలోని కణముల అడ్డగోడలుమాత్రము హరించిపోవుటచేత కణములవరుసలు 35-వ పటములోజూపినట్లు గొట్టములుగా నేర్పడవచ్చును. ఈగొట్టములు చెట్లవేళ్లచే పీల్చబడిన నీటిని ఆకులలోనికి వ్యాపింపజేయు కాలువలు. వీనికి దారువాహికలు (Wood Vessels) అనిపేరు.
జల్లెడ కాలువలు.
లేదా అట్టి యేకపం క్తిలోని కణముల అడ్డుగోడలందు జల్లెడకండ్లవలె రంధ్రము లేర్పడవచ్చును. ఈ రంధ్రములగుండ