పుట:Jeevasastra Samgrahamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యు, నీటిని చొరనియ్యకపోవుటయునే గాక మరికొన్ని మార్పులవలన మ్రానులయొక్క పలురంగు లేర్పడుచున్నవి. ఇట్టిమార్పులచేతనే చెట్లయొక్క చేవయును, సొంపును, నాణెమును గలుగుచున్నవి. ఇట్టి రసాయనసమ్మేళనమునందలి మార్పులచేతనే తుమ్మజిగురు మొదలగు జిగటపదార్థములు పుట్టుచున్నవి. ఇంకను నిట్టిచిత్రమైన విషయములనుగూర్చి వృక్షశాస్త్రము భోదించును.

4. కణమునందలి పదార్థములలోని మార్పులు.

లేతవృక్షకణములందు ప్రథమమున మూలపదార్థము నిండుగ నుండునని వ్రాసియుంటిమి. కణము పెరిగినకొలదిని దానితో సమముగ మూలపదార్థము పెరుగలేక కణముయొక్క చుట్టుగోడను జేరి కొంతస్థలము ఆక్రమించుకొనియుండును. ఇదికాక యీమూలపదార్థము కణముయొక్క మధ్యభాగమున జీవస్థానముచుట్టును స్వల్పమాత్రమును, దానినుండి కణకవచముయొద్ద నుండు మూలపదార్థము వరకు వ్యాపించు కిరణములుగా స్వల్పమాత్రమును వ్యాపించియుండును. ఈవిషయమై పసిరికపోగులో జెప్పియుంటిమి (36-వ పటము చూడుము). తక్కిన మధ్యభాగమంతయును అవకాశముగా నుండును. ఇది కణరసము (Cell sap) అను నీటివంటి ద్రవపదార్థముతో నిండియుండును. ఈ ద్రవపదార్థమే ఆయావృక్షముల స్వభావమునుబట్టి చెరకు