పుట:Jeevasastra Samgrahamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును ప్రత్యేకముగా జేకొని వృద్ధిబొందుచుండును. ఈకణమే యంత్యకణము (Apical Cell), తక్కిన కణములన్నియు అంతటితో వృద్ధిహీనము లగును. ఈ యంత్యకణమునుండియే నాచు మొక్కయంతయు నిర్మాణ మగుచున్నది.

మల్బెరీదశనుండి హైడ్రా ఎట్లుపరిణమించును?

మల్బెరీయవస్థను దాటగానే నాచుమొక్కనుండి వీడిపోయిన హైడ్రాయొక్క పిండమున కీ దిగువరీతిని పెంపుగలుగును.

ఇంతవరకు నేకరూపముగ నుండిన కణములు ఒండొరుల యొత్తుడుచేత కొన్నిమార్పులను జెందును. ఆ కణముల వలయాకారమైన గోడలు పలకలు దేరును. అందుచే నాకణములు బహుభుజ (Polygonal) కణము లగును. పిమ్మట కొద్దికాలములోనే యీ రాశియందలి కణములు మధ్యనుండి వెలుపలికి గెంటబడి నూతియిటుకలవలె నొకదానిప్రక్క నొకటిజేరి తమ లోపలి తట్టున కొంత అవకాశము నావరించును (29-వ పటములో 5. చూడుము). ఈ కణములు క్రమముగా పెరుగుచుండును. అందొకభాగమునందలి కణములు తక్కిన భాగమునందలి కణములకంటె చురుకుగ పెరుగుటచే నాభాగము రెండవభాగముకంటె పొడుగైన కణములుగలది యగును (29-వ పటములో 5, 6 లలో పైవైపున చూడుము). ఈపొడుగుకణములు గలచోట నొకగుంటపడి ఆగుంట క్రమముగా పెద్దదై లోపలికి దించుకొనిపోవుచు వెలుపలనుండు పొట్టికణముల డిప్పలో మరియొకపొరగా నేర్పడును (29-వ పటములో 6, 7. చూడుము). ఇందు లోపలి