పొరయే హైడ్రాయొక్క అంతశ్చర్మముగా నగును. వెలుపలిపొర బహిశ్చర్మ మగును.
పిమ్మట ఈ బహిశ్చర్మకణములకు మృదురోమములు గలిగి వీని సహాయముచే నీ పిండము మెల్ల మెల్లగ నీదులాడుచుండును. ఇప్పటికి పిండమును కొంచెము పొడుగుగా నెదుగును. పిండముయొక్క మధ్యభాగము పొడుగున నంతటను గొట్టమువంటి బిలముగా నేర్పడును. ఇదియే హైడ్రాలోని జీర్ణాశయముయొక్క ప్రథమరూపము. పిమ్మట నీ పిండము మృదురోమముల విసర్జించి నీటిలో మునిగియున్నట్టి యేదోయొకపదార్థము నంటుకొని నిలువుగ నెదుగును. తదనంతరము కొనసమీపమున చిన్న చిన్న మొటిమలు పుట్టును. ఇవి మీసముల ప్రథమరూపములు. ఈ మొటిమలకు పై తట్టుననుండుభాగము కొంచెమెదిగి క్రీవాయి యగును. ఈక్రీవాయియొక్క చివరభాగముననుండెడి రంధ్రము జీర్ణాశయమునకు వెలుపలి నీటికిని మార్గముగా నేర్పడును. ఇదియే దీని నోరు. ఇంతటినుండి హైడ్రా తన మీసముల సహాయముచే జంతువుల పట్టి తిని బ్రతుకును.
ఏకకణదశనుండి మల్బెరీదశవరకు నాచుమొక్కయొక్క పూర్వికులును, హైడ్రాయొక్క పూర్వికులును, నొక్కపోలికనే యుండెడివారనియు, అందుచే వారు బహుశ: ఒక్క సంతతిలోని వారే యనియు వ్రాసియుంటిమి. తదనంతరము మల్బెరీదశను దాటినపిమ్మట కొన్నిపిండములు చెట్లుగాను, మరికొన్నిపిండములు జంతువులుగాను పరిణమించి నాచుమొక్కలును హైడ్రాలును