కొమ్మలకు వెళ్లినకొలది 'ఆవ్రేలి కావ్రేలు ఎడము' అన్నట్లు పోలికలు దూరమగుచుండును. ఒక సంతతిలోనివారికి బాంధవ్యము దూరమైనకొలదిని నై సర్గిక వ్యత్యాసములు హెచ్చగుచుండును. ఈ న్యాయమును మననాచుమొక్కకును, హైడ్రాకును గల సంబంధ బాంధవ్యములను గనుగొనుటలో ప్రయోగించిచూతము.
హైడ్రానాచుమొక్కలకు గలపోలికలు.
హైడ్రాయును, నాచుమొక్కయు నొక్కసంతతిలోనివే యైనయెడల వాని యాదిపురుషము ఏకకణపిండము. ఆ యాదిపురుషముయొక్క సంతతి రెండుకణములు గలపిండములు. వీనియందు వ్యత్యాసము లున్నట్టు కన్పట్టదు. అనగా నివిరెండు నన్నదమ్ములవలెనొక్కపోలిక నుండును. రెండుకణములు గల యీపిండముల సంతతి నాలుగుకణములు గల పిండములు. ఈస్థితియందుగూడ నాచునకును హైడ్రాకును వ్యత్యాసము లేదు. ఇట్లే కొన్నితరములవరకును అనగా మల్బెరీదశయందలి పిండములదనుక వచ్చువరకును పోలికలు ఎంతమాత్రము చెడలేదు. పిమ్మట హైడ్రాయొక్క మల్బెరీప్ండమును, నాచుమొక్కయొక్క మల్బెరీపిండమును వేరుదారులు త్రొక్కినవి. ఇంతవరకు రెండును ఏకముగా నొకటేదారిని వచ్చుచుండినవి. ఈదశదాటినపిమ్మట నిట్లు వేరుదారులు త్రొక్కగానే వాని బిడ్డలపోలికలలో నై సర్గిక వ్యత్యాసములు హెచ్చినవి. ఒకటి అనగా నాచు వృక్షజాతిదిగను, రెండవది హైడ్రా జంతుజాతిదిగను పరిణమించినవి. నాచుమొక్కయొక్క మల్బెరీదశయందుండుకణములలో నేదో యొకకణము కణఖండన వ్యాపార